Sexual Harrasment: రీసెర్చ్ స్కాలర్ పై ఎన్ఐఎన్ శాస్త్రవేత్త లైంగిక వేధింపులు... హైదరాబాద్ లో అరెస్ట్!

  • సైంటిస్ట్ భాస్కరాచారిపై రీసెర్చ్ స్కాలర్ ఫిర్యాదు
  • నిజమేనని తేల్చిన ఎన్ఐఎన్ కమిటీ
  • తప్పించుకు తిరుగుతుండగా అరెస్ట్

పదవీ విరమణ వయసు దగ్గర పడ్డా ఓ శాస్త్రవేత్త, తన వద్ద రీసెర్చ్ స్కాలర్ గా ఉన్న విద్యార్థినిపై కన్నేసి, ఆమెను లైంగికంగా వేధించి చిక్కుల్లో పడి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. హైదరాబాద్, ఉస్మానియా పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్త భాస్కరాచారి (58) తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ విద్యార్థిని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

ఆపై ఓ నిజ నిర్దారణ కమిటీని నియమించగా, భాస్కరాచారి వేధింపులు నిజమేనని తేలడంతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు. ఆపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుతో పాటు నిర్భయ చట్టం కింద భాస్కరాచారిపై కేసు నమోదు కాగా, నెల రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఆయన, ముందస్తు బెయిల్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనపై నిఘా పెట్టిన పోలీసులు, బంధువుల ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని, నిన్న అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

Sexual Harrasment
NIS
  • Loading...

More Telugu News