kala: రజనీకాంత్‌ కొత్త సినిమాను కర్ణాటకలో ఆడనివ్వం: తేల్చి చెప్పిన కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు

  • కర్ణాటకలో 'కాలా' విడుదలకు కష్టాలు
  • కావేరి జలాల విషయంలో తమిళనాడుకు మద్దతుగా రజనీ
  • మండిపడుతోన్న కన్నడ రక్షణ వేదిక
  • చర్చిస్తామన్న సీఎం కుమారస్వామి

సినీనటుడు రజనీకాంత్‌ నటించిన ‘కాలా’ సినిమా విడుదలకు కర్ణాటకలో కష్టాలు తప్పేలా లేవు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన రజనీ.. ఇటీవల కావేరి జలాల విషయంలో తమిళనాడుకు మద్దతుగా మాట్లాడగా, ఆ వెంటనే స్పందించిన కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి రజనీ నటించిన 'కాలా' సినిమాను తమ రాష్ట్రంలో విడుదల కానివ్వమని ప్రకటించింది.  

ఈ క్రమంలో తాజాగా, కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్‌ శెట్టి తమ రాష్ట్రంలో 'కాలా' సినిమా విడుదల వివాదంపై మాట్లాడుతూ ఒకవేళ కర్ణాటకకు రజనీకాంత్‌ బహిరంగ క్షమాపణ చెప్పినా తాము విడుదలకు ఒప్పుకునే పరిస్థితే లేదని అన్నారు. కావేరి జలాలపై తమిళనాడుకు అనుకూలంగా మాట్లాడుతోన్న రజనీకాంత్‌, కమల హాసన్‌ లకు సంబంధించిన ఏ సినిమా కూడా తమ రాష్ట్రంలో విడుదల కావడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఇతర హీరోల తమిళ సినిమాల విడుదలకు మాత్రం తమకేం అభ్యంతరం లేదని చెప్పారు. ఈ విషయంపై స్పందించిన కర్ణాటక సీఎం కుమారస్వామి తాము మరోసారి వారితో చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

kala
Rajinikanth
Karnataka
  • Loading...

More Telugu News