Ravela Kishore Babu: మాజీ మంత్రి రావెల కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. చుట్టుముట్టిన ఎస్టీ సంఘాల నాయకులు!

  • తహసీల్దార్‌పై రావెల అనుచరుల దాడి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • కార్యాలయాన్ని ముట్టడించిన ఎస్టీ నాయకులు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కార్యాలయాన్ని ఎస్టీ సంఘాల నాయకులు చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. వట్టిచెరుకూరు తహసీల్దార్‌ రాములు నాయక్‌పై రావెల అనుచరులు కొందరు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన తహసీల్దార్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన రావెల అనుచరులు సూర్యప్రకాశ్, నల్లూరి సుబ్బారావు, వీరయ్య చౌదరిపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

రాములు నాయక్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఎస్టీ సంఘాల నాయకులు వెంటనే రావెల కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Ravela Kishore Babu
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News