KTR: హైదరాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తాం: మంత్రి కేటీఆర్‌

  • ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం
  • తడి చెత్తను ఎరువుగా, పొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నాం
  • త్వరలో ఎలక్ట్రిక్‌ వాహన పాలసీనీ కూడా తీసుకొస్తాం

హైదరాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు నగరంలోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ వారోత్సవాలలో ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ఎలక్ట్రిక్ వాహనాలను అందజేశారు.

తడి, పొడి చెత్తను వేరు చేసి.. తడి చెత్తను ఎరువుగా, పొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. అలాగే త్వరలో ఎలక్ట్రిక్‌ వాహన పాలసీని కూడా తీసుకొస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాగా, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపుకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను కేటీఆర్‌తో పాటు ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు కూడా సందర్శించారు.

KTR
KCR
Telangana
TRS
Hyderabad
Hyderabad District
  • Loading...

More Telugu News