savithri: సావిత్రికి 7 బంగ్లాలు ఉండేవి .. అవన్నీ పోగొట్టుకున్నారు: మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి

- సావిత్రి ఫ్యామిలీతో అనుబంధం వుంది
- ఆమె దానధర్మాలు బాగా చేసేవారు
- ఆర్థికంగా మరీ అంతగా చితికిపోలేదు
'మహానటి' సినిమా విశేషమైన ఆదరణ పొందుతోన్న నేపథ్యంలో సావిత్రితో తమకి గల అనుబంధాన్ని చాలామంది మీడియాతో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా సావిత్రి ఫ్యామిలీతో తమకి గల అనుబంధాన్ని గురించి మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రస్తావించారు. "సావిత్రి గారితో మా అమ్మకి చాలా సాన్నిహిత్యం ఉండేది. అందువలన అమ్మతో కలిసి నేను ఆ ఇంటికి వెళ్లడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉండేది. అడిగినవారికి లేదనకుండా సావిత్రి దానధర్మాలు చేసేవారు.
