charan: పోలీస్ ఆఫీసర్ గా చరణ్ .. గ్యాంగ్ స్టర్ గా ఎన్టీఆర్?

  • రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ 
  • అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • త్వరలోనే కథానాయికల ఎంపిక  

రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే టాక్ వచ్చింది. దాంతో అందరిలో ఎన్టీఆర్ పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి తలెత్తింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఇద్దరూ సోదరులే అయినప్పటికీ వాళ్లు ఎంచుకున్న మార్గాలు వేరు. ఈ పరిస్థితుల్లో చోటుచేసుకునే పరిణామాలతో కథ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించే ఈ సినిమా కోసం త్వరలోనే కథానాయికలను ఎంపిక చేయనున్నారు.  

  • Loading...

More Telugu News