Pawan Kalyan: చంద్రబాబు నాయుడిని ఈ నీళ్లు తాగమనండి.. అప్పుడు తెలుస్తుంది!: పవన్ కల్యాణ్

  • చంద్రబాబు ప్రభుత్వంపై పవన్ డైరెక్ట్ అటాక్
  • సీఎంతో ఈ నీళ్లు తాగించాలని సూచన
  • అప్పుడు కానీ సమస్య పరిష్కారం కాదన్న జనసేనాని

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వంపై డైరెక్ట్ అటాక్ ప్రారంభించారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిరసన కవాతు నిర్వహించిన పవన్ అక్కడి నీటి సమస్యపై స్పందించారు.

నీళ్ల బాటిల్‌ను చూపిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ నీళ్లు తాగాలని చెప్పాలని ప్రజలకు సూచించారు. అప్పుడు కానీ ఇక్కడి వారి బాధలు ఆయనకు తెలిసిరావన్నారు. పూర్తిగా కలుషితమైన ఈ నీటిని తాగితే కలరా, అంటువ్యాధులు రాకుండా ఉంటాయా? అని ప్రశ్నించారు. పార్వతీపురం ఎవరొచ్చినా ఈ నీళ్లే ఇచ్చి తాగమని చెప్పాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి.. ఇలా ఎవరు వచ్చినా అందరికీ ఈ నీళ్లు ఇస్తేనే సమస్య పరిష్కారమవుతుందని పవన్ అన్నారు.

Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
CBN
  • Loading...

More Telugu News