Andhra Pradesh: నెలకు రూ.1000.. నిరుద్యోగ భృతిపై ఏపీ సర్కారు కీలక ప్రకటన!

  • రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి
  • డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారే అర్హులు
  • కుటుంబంలో ఎంతమంది అర్హులున్నా వర్తింపు 
  • బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై వుండాలి    

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న నిరుద్యోగ భృతి అమలుపై రాష్ట్ర సర్కారు ఈరోజు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు నెలకు1000 రూపాయల చొప్పున చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. డిగ్రీ లేక డిప్లొమా పూర్తి చేసిన వారే నిరుద్యోగ భృతి పొందేందుకు అర్హులుగా పేర్కొంది. నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు గత బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయించారు.  

ఈ విషయంపై అమరావతిలో మీడియాతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ... నిరుద్యోగ భృతి అమలుపై తాము ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం 10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిందని, ఆ తరువాత విధివిధానాలు రూపొందించామని అన్నారు. పరిమితి అన్నది లేకుండా కుటుంబంలో ఎంతమంది అర్హులున్నా అందరికీ వర్తిస్తుందని అన్నారు. అయితే, అభ్యర్థులు బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువున) కుటుంబానికి చెందిన వారై వుండి, తెల్ల రేషన్ కార్డు కలిగి వుండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వుండాలి.

  • Loading...

More Telugu News