nikhil: నిఖిల్ మూవీ నుంచి ఆసక్తిని రేకెత్తించే ప్రీ లుక్

- సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ తాజా చిత్రం
- కథానాయికగా లావణ్య త్రిపాఠి
- రేపు ఉదయం ఫస్టులుక్ రిలీజ్
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' .. 'కేశవ' .. 'కిరాక్ పార్టీ' సినిమాలతో నిఖిల్ వరుస సక్సెస్ లను అందుకున్నాడు. తన సినిమా రిలీజ్ అవుతుందంటే యూత్ అంతా ఎదురుచూసేలా చేశాడు. ఆయన తాజా చిత్రం టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో రూపొందుతోంది. 2016లో తమిళంలో వచ్చిన 'కణితన్' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మూవీకి రీమేక్ గా .. అదే దర్శకుడితో ఈ సినిమా రూపొందుతోంది.
