Maharashtra: మహారాష్ట్రలో అనూహ్యం... బీజేపీని వెనక్కు నెట్టేసిన ఎన్సీపీ!

  • నాలుగో రౌండ్ వరకూ బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
  • ఏడో రౌండ్ ముగిసేసరికి ఎన్సీపీ అభ్యర్థికి అధిక ఓట్లు
  • దోబూచులాడుతున్న విజయలక్ష్మి

మహారాష్ట్రలోని భండారా-గోండియా లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ క్షణక్షణానికీ పెరుగుతోంది. తొలి నాలుగు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి  హేమంత్ పాట్లే ముందుండగా, ఏడో రౌండ్ వచ్చేసరికి అనూహ్యంగా ఎన్సీపీ అభ్యర్థి కకడే ఎం తశ్వంతరావు లీడింగ్ లోకి వచ్చేశారు. ఆయన బీజేపీ అభ్యర్థికన్నా 4 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఇక అదే రాష్ట్రంలోని పాలుస్ పాల్ గఢ్ లో మాత్రం బీజేపీ పరువు దక్కించుకునేలా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గవిత్ రాజేంద్ర దేడ్యా విజయం దిశగా సాగుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ సిట్టింగ్ స్థానం కైరానా, ఆర్ఎల్డీ ఖాతాలోకి చేరిపోయినట్టే. ఇక్కడ తబుస్సుమ్ 50 వేల ఓట్ల ఆధిక్యంలోకి వెళ్లి, సమీప బీజేపీ అభ్యర్థికి అందనంత ఎత్తునకు చేరుకున్నారు. నాగాలాండ్ స్థానంలో ఎన్డీపీపీ అభ్యర్థి టోకిహో లీడ్ లో ఉన్నారు.

  • Loading...

More Telugu News