: కీళ్లనొప్పులకు మూలకారణం తెలిసింది
ఏ వ్యాధి, ఏ రుగ్మత ఎందుకు వస్తోందో.. మూల కారణం తెలిస్తే.. దానికి మరింత స్పష్టమైన వైద్యం అందించడం సులభం అయిపోతుంది. మనుషుల్లో దాదాపు 80శాతం మందిని ఇబ్బంది పెడుతూ ఉండే కీళ్లనొప్పుల విషయంలోనూ ఇలాంటి అసలు కీలకాన్ని వైద్యులు కనుగొన్నారు. మోకాల్లోని కొవ్వు కణాలు విడుదల చేసే ప్రొటీన్‌కు, కీళ్ల నొప్పులకు సంబంధం ఉన్నదని గుర్తించారు. కీళ్లనొప్పులకు కొత్త జన్యు చికిత్సలను కనుగొనడంలో ఈ పరిశోధన చాలా కీలకం అవుతుందని భావిస్తున్నారు.
మోకాలి కీళ్లలోని కొవ్వు ప్రొఫ్యాక్టర్`డి అనే విటమిన్‌ను విడుదల చేస్తుంది. ఫ్యాక్టర్ డి అనే ప్రొటీన్ మోతాదు పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. కీళ్లనొప్పులకు అదే కారణం అని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన నిర్మల్ బందా చెప్పారు. ఫ్యాక్టర్ డీ ప్రొటీన్ లేని వారికి కీళ్ల నొప్పులు రావడం లేదని కూడా వారు గుర్తించారు. ఈ ప్రొటీన్‌ను శరీరంలోంచి నిర్మూలించే జన్యుచికిత్సల ఆవిష్కారానికై ఆయన పరిశోధనలు చేస్తున్నారు.