sim card: నిన్న సిమ్.. నేడు యాప్.. వాట్సాప్‌కు పోటీగా పతంజలి యాప్!

  • కింభో పేరుతో స్వదేశీ మెసేజింగ్ యాప్ విడుదల
  • ఇక భారత్ మాట్లాడుతుందన్న పతంజలి
  • ఇటీవల పతంజలి సిమ్  కార్డుల విడుదల

స్వదేశీ సమృద్ధి సిమ్ పేరుతో ఓ సిమ్‌కార్డును విడుదల చేసి టెలికం రంగంలోకి ప్రవేశించిన పతంజలి సంస్థ.. తాజాగా మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సాప్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ‘కింభో’ పేరుతో సరికొత్త మెసేజింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. యోగా గురు రాందేవ్ బాబా ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా ట్వీట్ చేస్తూ.. ఇక భారత్ మాట్లాడుతుందని పేర్కొన్నారు. వాట్సాప్‌కు గట్టి పోటీ ఎదురుకాబోతోందని అన్నారు. ఈ స్వదేశీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో కలిసి ఇటీవల స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను విడుదల చేసిన రాందేవ్ బాబా, రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే, పతంజలి సిమ్ యూజర్లకు ఆ సంస్థ ఉత్పత్తులపై పదిశాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు స్వదేశీ యాప్‌తో విదేశీ నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు.

  • Loading...

More Telugu News