kl rahul: నాగచైతన్య హీరోయిన్ తో కలిసి కెమెరా కంటికి చిక్కిన కేఎల్ రాహుల్

  • నిధి అగర్వాల్ తో కలిసి జంటగా కనిపించిన రాహుల్
  • డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్
  • 'సవ్యసాచి' సినిమాలో నటిస్తున్న నిధి

సినీ హీరోయిన్లు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణాలు, పెళ్లిళ్లు సర్వసాధారణమే. ఇటీవలే కోహ్లీ, అనుష్క శర్మలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు మరో జంట గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీమిండియా బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ లు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం ముంబైలోని బాంద్రాలో వీరిద్దరూ జంటగా కనిపించినప్పటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇద్దరిలో ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు, తెలుగులో కూడా నిధి అగర్వాల్ ఓ సినిమా చేస్తోంది. నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'సవ్యసాచి' చిత్రంలో ఆమే హీరోయిన్. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

kl rahul
nidhi agarwal
love
savyasachi
naga chitanya
tollywood
  • Loading...

More Telugu News