Bonda Uma: స్థలం ఇస్తామని చెప్పి డబ్బు తీసుకున్నారు: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమపై మరో ఫిర్యాదు

  • విజయవాడలోని సుబ్బరాయనగర్ వెంచర్‌లో స్థలం
  • రూ.35 లక్షలు సమర్పించుకున్నామన్న బాధితుడు
  • స్థానికులతో కలిసి పోలీసులకు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు

విజయవాడలోని సుబ్బరాయనగర్ వెంచర్‌లో స్థలం ఇస్తామని డబ్బు తీసుకుని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తమను మోసం చేశారని నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆరోపించారు. తాము ఆయనకు మొత్తం రూ.35 లక్షలు సమర్పించుకున్నామని అన్నారు. ఈ రోజు స్థానికులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన సుబ్రహ్మణ్యం.. బోండా ఉమా మహేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు.

బోండా ఉమపై గతంలోనూ ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. స్వాతంత్ర్య సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో బోండా ఉమ అనుచరులు తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు ఫిర్యాదు చేయగా, సదరు ఎమ్మెల్యే మాత్రం అవి తప్పుడు ఆరోపణలని వివరణ ఇచ్చారు.         

Bonda Uma
Telugudesam
Vijayawada
  • Loading...

More Telugu News