jayaprakash reddy: ముక్కుకి సర్జరీ చేయించుకున్నాను.. మరో సిటింగ్ లోపు ఆ డాక్టర్ చనిపోయారు!: నటుడు జయప్రకాశ్ రెడ్డి

  • చిన్నప్పుడు నాది చట్టిముక్కు అనేవారు 
  • సినిమాల్లోకి వచ్చాక సర్జరీ చేయించుకోమన్నారు 
  • ఆ ప్రయత్నం కొంతవరకే ఫలించింది      

గంభీరమైన రూపంతో .. అంతకు మించిన గంభీరమైన స్వరంతో జయప్రకాశ్ రెడ్డి ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ముచ్చటించారు. తన ముక్కుకి సంబంధించిన ప్రస్తావన రావడంతో, ఆయన ఇలా చెప్పుకొచ్చారు. " చిన్నప్పుడు అందరూ నాది చట్టిముక్కు .. చట్టిముక్కు అనేవాళ్లు. సినిమాల్లోకి వచ్చిన తరువాత కొంతమంది నా ముక్కు నిటారుగా వుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని నా సన్నిహితుడి దగ్గర ప్రస్తావిస్తే, ఆయన ఒక మంచి కేరళ సర్జన్ దగ్గరికి తీసుకెళ్లాడు. నిజంగానే ఆయన చాలా గొప్ప సర్జన్ .. ఇది చాలా సింపుల్ సర్జరీ అంటూ ఆయన ఒక సిటింగ్ లో కొంతవరకూ చేసేశారు. 6 నెలల తరువాత మరో సిటింగ్ లో ముక్కు పై భాగాన్ని సెట్ చేద్దామని చెప్పారు. కానీ పాపం ఆ డాక్టర్ ఆ తరువాత కారు ప్రమాదంలో చనిపోయారు. ఇక వేరే డాక్టర్ దగ్గరికి నేను వెళ్లలేదు" అని చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News