Sridevi: అమ్మ ఆఖరి స్పర్శ ఇప్పటికీ గుర్తుంది: శ్రీదేవితో గడిపిన చివరి రోజుపై జాన్వీ కపూర్

  • వోగ్ మేగజైన్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ
  • దుబాయ్ వెళ్లే ముందు రోజు ఘటనను గుర్తు చేసుకున్న జాన్వీ
  • అమ్మకూచిగా పెరిగిన జాన్వీ

తొలి చిత్రం 'ధడక్' ద్వారా సినీ పరిశ్రమలో కాలుపెట్టనున్న జాన్వీ కపూర్ 'వోగ్' మేగజైన్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, తల్లి శ్రీదేవితో తాను గడిపిన చివరి రాత్రిని గుర్తు చేసుకుంది. "ఆమె పెళ్లికి బయలుదేరే ముందు రోజు (యూఏఈలో మోహిత్ మార్వా వివాహానికి) నాకు షూటింగ్ ఉంది. ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. నన్ను నిద్ర పుచ్చాలని అమ్మను అడిగాను. కానీ, ఆమె బట్టలు సర్దుకునే పనిలో బిజీగా ఉంది. ఆ పని పూర్తి చేసుకుని నా వద్దకు వచ్చేసరికి నేను మగత నిద్రలోకి జారుకున్నాను. అమ్మ నా తలను నిమిరి వెళ్లిపోయింది. ఆమె ఆఖరి స్పర్శ నాకింకా గుర్తుంది" అని వ్యాఖ్యానించింది. చిన్నప్పటి నుంచి అమ్మకూచిగా జాన్వీ పెరిగిందన్న సంగతి తెలిసిందే. తన చిన్న కుమార్తె ఖుషీ తనను తాను చూసుకోగలదని, పెద్దమ్మాయికే తన అవసరం చాలా ఉందని శ్రీదేవి గతంలో పలుమార్లు వెల్లడించారు కూడా.

Sridevi
Jahnvi Kapoor
Vouge Magazine
Interview
  • Loading...

More Telugu News