Mahesh Babu: మహేశ్ మూవీలో అల్లరి నరేశ్ చేయడం ఖాయమైపోయింది!

  • త్వరలో సెట్స్ పైకి మహేశ్ 25వ మూవీ 
  • ఆయన స్నేహితుడి పాత్రలో 'అల్లరి' నరేశ్
  • కామెడీ .. ఎమోషన్ కలగలిసిన పాత్ర  

మహేశ్ బాబు ఇంతవరకూ తన కెరియర్లో 24 సినిమాలు పూర్తిచేశాడు. ప్రస్తుతం ఆయన 25వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను అల్లరి నరేశ్ చేయనున్నాడనే టాక్ వచ్చింది. అది నిజమేనన్నది తాజా సమాచారం.

రీసెంట్ గా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అగ్రిమెంట్ పై అల్లరి నరేశ్ సైన్ చేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన మహేశ్ బాబు స్నేహితుడిగా సినిమా అంతటా కనిపిస్తాడని చెబుతున్నారు. ఫస్టాఫ్ లో కామెడీగా .. సెకండాఫ్ లో ఎమోషనల్ గా ఆయన పాత్ర ఉంటుందని అంటున్నారు. జూన్ రెండవవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. జూలై నుంచి అల్లరి నరేశ్ షూటింగులో జాయిన్ అవుతాడట. ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకువస్తుందని ఆయన భావిస్తున్నాడు. 

  • Loading...

More Telugu News