jayaprakash reddy: రాయలసీమ యాస వంటబట్టడానికి కారణమదే: నటుడు జయప్రకాశ్ రెడ్డి
- మా తాతయ్య వాళ్లది కర్నూలు ప్రాంతం
- మా నాన్న రాయలసీమలో పనిచేశారు
- ఆ ప్రాంతాలు నాకు బాగా పరిచయం
తెలుగు తెరపై ఇటు విలనిజాన్ని .. అటు కామెడీని అద్భుతంగా పండించగలిగిన నటుల్లో జయప్రకాశ్ రెడ్డి ఒకరుగా కనిపిస్తారు. ఇక రాయలసీమకి చెందిన పాత్రల్లో ఆయన విశ్వరూపం చూపించేస్తూ వుంటారు. అలాంటి జయప్రకాశ్ రెడ్డి తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"మా తాతగారిది కర్నూల్ జిల్లా .. నంద్యాల .. ఆళ్లగడ్డ మధ్యలో. అక్కడే మాకు ఓ 20 ఎకరాల పొలం ఉండేది. మా తాతయ్య అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. సెలవులు వచ్చినప్పుడు నేను మా తాతయ్య దగ్గరికి వెళుతూ ఉండేవాడిని. అందువలన నాకు ఆ ప్రాంతాలు బాగా పరిచయం .. అక్కడి భాష కూడా నాకు అంతగా అబ్బడానికి కారణమదే. ప్రభుత్వ ఉద్యోగిగా నాన్నగారు కర్నూలు .. కడప .. అనంతపురం ప్రాంతాల్లో పనిచేశారు. రాయలసీమ యాస బాగా పట్టుబడటానికి ఇది కూడా ఒక కారణమైంది" అని చెప్పుకొచ్చారు.