madhusudhana chary: హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన స్పీకర్ మధుసూదనాచారికి జరిమానా విధించండి: కాంగ్రెస్

  • భూపాలపల్లిలో మధుసూదనాచారి బైక్ ర్యాలీ
  • హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన స్పీకర్
  • జరిమానా విధించాలని కోరిన కాంగ్రెస్ నేత 

సొంత నియోజకవర్గం భూపాలపల్లిలో బస్టాండు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి బైక్ ర్యాలీ నిర్వహించారు. గత వారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా స్పీకర్ బైక్ నడిపారు. దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా స్పీకర్ ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా బైకు నడిపే సాధారణ ప్రజలకు విధించినట్టుగా స్పీకర్ కు రూ. 100 నుంచి రూ. 500 వరకు జరిమానా విధించాలని కోరారు. బైక్ ర్యాలీలో మధుసూదనాచారితో పాటు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పోలీసు అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

madhusudhana chary
speaker
Telangana
byke rally
helmet
bakka judson
  • Loading...

More Telugu News