Uttar Pradesh: పలు రాష్ట్రాల్లో పిడుగులు.. 40 మంది మృతి

  • బీహార్‌లో 17, యూపీలో 9, జార్ఖండ్‌లో 12 మంది మృతి
  • మరో 30 మందికి గాయాలు
  • ఈరోజు కూడా వర్షాలు పడే అవకాశం

ప్రకృతి ప్రకోపానికి ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, బీహార్‌ రాష్ట్రాల ప్రజలు గజగజలాడారు. నిన్న వర్షాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడడంతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగుపాటుకి బీహార్‌లో 17 మంది, ఉత్తరప్రదేశ్ లో 9 మంది, జార్ఖండ్‌లో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి గాయాలయ్యాయి. ఆ మూడు రాష్ట్రాల్లో ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది.                                   

Uttar Pradesh
jarkhand
bihar
  • Loading...

More Telugu News