salman: సల్మాన్ సినిమా కోసం ఫెరారీ కార్లనే పేల్చేశారట!

  • సల్మాన్ హీరోగా 'రేస్ 3'
  • అబుదాబిలో యాక్షన్ ఎపిసోడ్
  • భారీస్థాయిలో ఖర్చు

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రెమో డిసౌజా దర్శకత్వంలో 'రేస్ 3' సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ను 'అబుదాబి'లో చిత్రీకరించారు. భారీ ఛేజింగ్ తో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఖరీదైన కార్లను వాడారట.

ఈ షూటింగులో భాగంగా ఫెరారీ .. లంబోర్ఘిని .. ఆస్టన్ మార్టిన్ .. మసెరటి వంటి ఖరీదైన కార్లను పేల్చేశారట. ఈ కార్లను బ్లాస్ట్ చేయవలసి ఉంటుందని రెమో డిసౌజా ముందుగానే నిర్మాతలకి చెప్పారట. ఈ యాక్షన్ సీన్ అనుకున్నట్టుగా వస్తే చాలని భావించిన నిర్మాతలు ఇంత ఖర్చును భరించడానికి వెనుకాడలేదని సమాచారం. తెరపై ఈ యాక్షన్ సీన్ ఒక రేంజ్ లో ఉంటుందనీ .. ఇంతవరకూ సల్మాన్ చేసిన యాక్షన్ సీన్స్ లో ఇది బెస్ట్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు.  

  • Loading...

More Telugu News