akhilesh yadav: లక్నోలో ఉండడానికి ఓ ఇల్లు చూపించండి: మీడియాతో అఖిలేశ్ యాదవ్

  • మాజీ ముఖ్యమంత్రులను బంగళాలు ఖాళీ చేయమన్న ప్రభుత్వం 
  • లక్నోలో ఉండేందుకు అనువైన ఇల్లు లేదన్న ఎస్పీ చీఫ్
  • అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ మీడియా ప్రతినిధుల వద్ద అసంతృప్తి

లక్నోలో ఉండేందుకు అనువైన ఇల్లు లేకపోవడంతో ప్రభుత్వ బంగళాలోనే మరో రెండేళ్ల పాటు ఉండేందుకు అవకాశం ఇవ్వాలని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. తనకు ఓ ఇల్లు చూపించాలని తనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు అఖిలేశ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

‘‘ఖాళీ చేసి వెళ్లేందుకు మేము సిద్ధమే. కానీ, అందుకు మరింత సమయం కావాలి. నేతాజీ (ములాయంసింగ్), నేను ఉండేందుకు లక్నోలో తగిన ఇల్లు లేదు. మాకు అనువైనది ఏదైనా చూస్తే చెప్పండి’’ అంటూ అఖిలేశ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. అంశాలను పక్కదారి పట్టిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన పిటిషన్లలో తన అనారోగ్యాన్ని కారణంగా ములాయం చూపించగా, పిల్లల చదువులు, అనువైన ఇల్లు కనిపించకపోవడాన్ని అఖిలేశ్ కారణాలుగా పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వం ములాయం, అఖిలేశ్, మాయావతి సహా మాజీ ముఖ్యమంత్రులకు ప్రభుత్వ బంగళాలను విడిచి వెళ్లిపోవాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

  • Loading...

More Telugu News