idea 4d volte: దేశవ్యాప్తంగా 15 సర్కిళ్లలో మొదలైన ఐడియా 4జీ వోల్టే సేవలు... 30జీబీ ఉచిత డేటా
- ఈ నెల మొదట్లో ఆరు సర్కిళ్లు, తాజాగా తొమ్మిది సర్కిళ్లలో ప్రారంభం
- నాలుగు వారాలకోసారి 10జీబీ చొప్పున ఉచిత డేటా
- దేశవ్యాప్తంగా మొత్తం 22 టెలికం సర్కిళ్లు
ఐడియా 4జీ వోల్టే సేవలు దేశవ్యాప్తంగా 15 సర్కిళ్లలోకి అందుబాటులోకి వచ్చినట్టు కంపెనీ ప్రకటించింది. ఆయా సర్కిళ్లలో అన్ని జిల్లా కేంద్రాల్లో 4జీ సేవలు లభిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల మొదట్లోనే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సహా ఆరు సర్కిళ్లలో ఈ సేవలు ఆరంభం కాగా, తాజాగా తొమ్మిది సర్కిళ్లలో 4జీ వోల్టే సేవల్ని ప్రారంభించింది.
ప్రారంభ ఆఫర్ కింద 4జీ వోల్టే సేవల్ని ఎంచుకునే వారికి ఉచితంగా 30జీబీ డేటా ఇస్తున్నట్టు ఐడియా ప్రకటించింది. తొలుత 10జీబీ డేటాను ఇచ్చిన నాలుగు వారాల తర్వాత యూజర్లు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. దాంతో వారికి మరో 10జీబీ డేటా లభిస్తుంది. నాలుగు వారాల తర్వాత మరోసారి ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మరో 10జీబీ ఉచిత డేటా లభిస్తుంది.