gautam gambhir: ఇద్దరు అమ్మాయిలకు తండ్రిని అయినందుకు ఓ వైపు ఆందోళనగా ఉంది: గౌతమ్ గంభీర్

  • అత్యాచారాల వార్తలు పతాక శీర్షికల్లో వస్తున్నాయి
  • 'రేప్ అంటే ఏంటి నాన్నా' అని అడుగుతారేమో అనే ఆందోళన కలుగుతోంది
  • జరుగుతున్న పరిణామాలు బాధాకరం

సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్... దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న అత్యాచారాలపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఇద్దరు అమ్మాయిలకు తండ్రిని అయినందుకు చాలా సంతోషంగా ఉందని... అయితే చిన్న పిల్లలు కూడా అత్యాచారాలకు గురవుతున్నారనే వార్తలు వార్తాపత్రికల్లో మొదటి పేజీల్లో వస్తుండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పాడు.

ప్లే స్కూళ్లలో ఉండే పసి పిల్లలకు కూడా ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ? అనేది చెప్పాల్సిన అవసరం రావడం చాలా బాధాకరమని అన్నాడు. త్వరలోనే తన కూతుళ్లు కూడా 'రేప్ అంటే ఏమిటి నాన్నా?' అని అడుగుతారేమోననే ఆందోళన తనకు ఉందని చెప్పాడు. తాను చదువుకునే రోజుల్లో అమ్మాయిలు రాఖీ కడితే ఎంతో ఆనందించేవాడినని... ఇప్పుడు అలాంటి సోదరసోదరీమణుల సంబంధాన్ని ప్రోత్సహించగలరా? అని ప్రశ్నించాడు. 

gautam gambhir
daughters
rape
cricketer
  • Loading...

More Telugu News