kcr: ప్రధానిని కలవకుండానే హైదరాబాద్ కు రానున్నసీఎం కేసీఆర్!
- అర్థాంతరంగా ముగిసిన కేసీఆర్ ఢిల్లీ పర్యటన
- నాలుగు రోజుల పర్యటన ఒక్క రోజుతోనే సరి
- కేసీఆర్ కు లభించని మోదీ అపాయింట్ మెంట్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ తన పర్యటనను ఒక్క రోజులోనే ముగించుకుని రావడం చర్చనీయాంశమైంది. నిన్న తెలంగాణ కేబినెట్ భేటీ తర్వాత జోనల్ వ్యవస్థపై సవరణలకు సంబంధించి మాట్లాడే నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. ఈరోజు ఉదయం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి జోనల్ విధానం గురించి చర్చించారు.
ఈ సందర్భంగా విభజన చట్టంలోని పలు అంశాల గురించీ ప్రస్తావించినట్టు సమాచారం. అయితే, ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని, ప్రధాని నరేంద్ర మోదీని కూడా కేసీఆర్ కలవాల్సి ఉంది. కానీ, మోదీ అపాయింట్ మెంట్ కేసీఆర్ కు లభించలేదు. కొత్త జోనల్ విధానం గురించి మోదీతో చర్చించాలని అనుకున్నారు. మోదీ విదేశీ పర్యటన కారణంగానే కేసీఆర్ కు అపాయింట్ మెంట్ లభించలేదని సమాచారం.