gold: భారీగా పతనమైన బంగారం ధర

  • 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 31,965
  • రూ. 405 తగ్గిన బంగారం ధర
  • కిలో వెండి ధర రూ. 40,830

ఈనాటి బులియన్ ట్రేడింగ్ లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 405 తగ్గి రూ. 31,965కు పడిపోయింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడం, దేశీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం వల్ల పసిడి ధర తగ్గింది.

మరోవైపు వెండి ధరలు కూడా బంగారాన్నే అనుసరించాయి. కిలో వెండి ధర రూ. 370 తగ్గి రూ. 40,830కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,296.20 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 16.51 డాలర్లకు పడిపోయింది. 

gold
silver
rates
  • Loading...

More Telugu News