amit shah: నిధులు ఎగ్గొట్టేందుకు కొత్త నాటకం ఆడుతున్నారు: అమిత్ షాపై యనమల ఫైర్

  • యూసీలను ఇవ్వడంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉంది
  • ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక.. ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదు
  • రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు

యూసీలను సమర్పించడంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎప్పటికప్పుడు యూసీలను అందిస్తున్న ఏపీని పట్టుకుని... యూసీలను ఇవ్వడంలేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించడం దారుణమని మండిపడ్డారు. ఏమాత్రం అవగాహన లేకుండా అమిత్ షా మాట్లాడుతున్నారని అన్నారు.

నిధులను ఎగ్గొట్టేందుకు కొత్త నాటకానికి తెరదీస్తున్నారని ఆరోపించారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక... ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని మండిపడ్డారు. కావాలనే ఏపీకి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరైంది కాదని అన్నారు. కేంద్రం తీరు ఏపీ అభివృద్ధిని అడ్డుకునేలా ఉందని చెప్పారు. 

amit shah
yanamala
Andhra Pradesh
funds
uc
  • Loading...

More Telugu News