: పండ్ల వాసను పసిగట్టే ముక్కు !
మరి ముక్కు అన్నాక.. వాసనలను పసిగట్టకుండా ఎలా ఉంటుంది. దాని ప్రాథమిక లక్షణమే అది కదా! అని మీరు విస్తుపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇది మామూలు మన ముక్కు కాదు. శాస్త్రవేత్తలు రూపొందించిన ఎలక్ట్రానిక్ ముక్కు. మన శరీర దుర్వాసనల్ని పసిగట్టి హెచ్చరించే రోబోలను జపాన్ శాస్త్రవేత్తలు రూపొందిస్తే.. పండ్ల వాసనల్ని గుర్తించే కొత్త ఎలక్ట్రానిక్ ముక్కును స్పెయిన్, స్వీడన్లకు చెందిన వారు తయారుచేశారు.
స్పెయిన్లోని వాలెన్సియా పాలిటెక్నిక్ యూనివర్సిటీ, స్వీడన్ లోని గావ్లే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. పియర్స్, యాపిల్ ముక్కలనుంచి మీథేన్, బూటేన్ వంటి వాటి వాసనల్ని ఈ ఎలక్ట్రానిక్ ముక్కు చాలా బాగా గుర్తిస్తోందిట. ఈ ముక్కుకు మొత్తం 32 సెన్సర్లను అమర్చినట్లు పరిశోధకుల్లో ఒకరైన జోన్ పెలెగ్రి సెబాస్టియా చెబుతున్నారు.