Kadapa District: అత్తారింటికి వచ్చిన నవ వధువు రాత్రివేళ అదృశ్యం

  • కడప జిల్లా రాజంపేట సమీపంలో ఘటన
  • ఇంటి బయట అటూ, ఇటూ తిరుగుతూ అదృశ్యం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఉదయం వివాహం చేసుకున్న వధువు, రాత్రికి అదృశ్యమైన ఘటన కడప జిల్లా రాజంపేట మండల పరిధిలోని అత్తిరాలలో కలకలం రేపుతోంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇక్కడి వినాయక్ నగర్ ప్రాంతంలో నివసించే రమణమ్మ కుమార్తె సునీతకు, 25వ తేదీ ఉదయం వెంకటసుబ్బయ్య అనే యువకుడితో కోడూరులో వివాహం అయింది.

అదే రోజు సాయంత్రం భర్తతో కలసి వధువు తన అత్తారింటికి వచ్చింది. రాత్రి పూట ఇంటి బయట అటూ ఇటూ తిరుగుతున్న సునీత, ఒక్కసారిగా అదృశ్యమైంది. సునీత కనిపించకపోవడంతో కంగారుపడ్డ కుటుంబీకులు, చుట్టు పక్కల ఇళ్లలో వెతికి, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారులుతెలిపారు.

Kadapa District
Rajempet]
Newly Married
Missing
  • Loading...

More Telugu News