Arjun Rampal: విడిపోతున్నట్టు ప్రకటించిన బాలీవుడ్ జంట అర్జున్ రాంపాల్-మెహర్ రాంపాల్

  • విడిపోయిన బాలీవుడ్ అందమైన జంట
  • ఇకపై తమ మధ్య ఎటువంటి సంబంధాలు ఉండవని వ్యాఖ్య
  • ఎన్నో మధురానుభూతులు ఉన్నాయన్నఅర్జున్-మెహర్

రెండు దశాబ్దాల తమ వైవాహిక బంధానికి బాలీవుడ్ జంట అర్జున్ రాంపాల్-మెహర్ జెస్సియాలు చెక్ చెప్పేశారు. ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇకపై తమ ఇద్దరి గమ్యస్థానాలు వేర్వేరని పేర్కొన్నారు. అర్జున్-మెహర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మహీకా (16), మైరా (13) ఉన్నారు. ఇద్దరి మధ్య ఇప్పటి వరకు కొనసాగిన అన్ని సంబంధాలు ఇక ముగిసినట్టేనని, ఇంతకుమించి మరేమీ మాట్లాడబోనని అర్జున్ రాంపాల్ స్పష్టం చేశాడు.

తమ 20 ఏళ్ల వైవాహిక జీవితం ఎంతో గొప్పదని, ప్రేమ, ఆప్యాయత, అందమైన జ్ఞాపకాలతో అది నిండిపోయిందని ఇద్దరూ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై ఇద్దరం వేర్వేరుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఇకపై తమ మధ్య ఎటువంటి సంబంధాలు కొనసాగకపోయినప్పటికీ ప్రేమ మాత్రం నిలిచే ఉంటుందని పేర్కొన్నారు.

Arjun Rampal
Mehr Jessia
Bollywood
  • Loading...

More Telugu News