Kumaraswamy: నేనేమీ ప్రజల దయతో సీఎంను కాలేదు.. కాంగ్రెస్ దయతో అయ్యా: కుమారస్వామి

  • ప్రజల మద్దతుతో నేను సీఎంను కాలేదు
  • ఎన్నికల్లో నన్ను, నా పార్టీని ప్రజలు తిరస్కరించారు
  • రైతు రుణమాఫీ చేయని రోజున పదవి నుంచి తప్పుకుంటా

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దయతో తాను ముఖ్యమంత్రిని కాలేదని, కాంగ్రెస్ దయవల్లే సీఎం కాగలిగానని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ ప్రజలు తననెందుకు తిరస్కరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

తాజాగా రాష్ట్రంలోని ఆరున్నర కోట్ల మంది ఓట్లు వేయడం వల్ల తాను ముఖ్యమంత్రిని కాలేదని, కాబట్టి తనపై ఒత్తిడి ఉండే అవకాశం లేదని అన్నారు. తనను, తన పార్టీని ప్రజలు తిరస్కరించారని, కాంగ్రెస్ దయవల్ల ముఖ్యమంత్రిని కాగలిగానని పేర్కొన్నారు. ఏది ఏమైనా తాను సీఎం అయ్యాను కాబట్టి రైతు రుణ మాఫీనే తన లక్ష్యమని, దానిని నెరవేర్చని నాడు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని కుమారస్వామి పేర్కొన్నారు.

Kumaraswamy
Karnataka
Congress
JDS
  • Loading...

More Telugu News