: ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కణితులకు టమోటా, సోయా అడ్డుకట్ట


టమోటాతో, సోయా ఉత్పత్తులను కలిపి తింటే చాలు.. ఆటోమేటిగ్గా అవి క్యాన్సర్‌ కణితుల తయారీని అడ్డుకుంటాయి. పరిష్కారం సింపుల్‌గానే కనిపిస్తున్నా.. శాస్త్రవేత్తలు దీనిని ఎలుకలపై సమర్థంగా ప్రయోగించి చూశారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ సోకేలా చేసిన ఎలుకలకు టమోటా మరియు సోయా ఉత్పత్తులు తినిపించారు. 'వీటిలో సగం ఎలుకల్లో క్యాన్సర్‌ కణితులు ఏర్పడనే లేదు' అని ఇలినాయిస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాన్‌ ఎర్డ్‌మ్యాన్‌ చెప్పారు. టమోటా, సోయా తినకుండా ఉన్న ఎలుకలు మాత్రం నూటికి నూరుశాతం ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడ్డాయి.

టమోటా, సోయాలను విడివిడిగా తిన్నప్పటికీ క్యాన్సర్‌ ముప్పును కాస్త అడ్డుకుంటాయి గానీ.. కలిపి తిన్నప్పుడు మరింత బాగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. టమోటాలు తిన్నవాటిలో 61 శాతం, సోయా తిన్నవి 66 శాతం జబ్బు బారినపడ్డాయి. కలిపి తిన్నవాటిలో వ్యాధి సోకింది 45 శాతం ఎలుకలకు మాత్రమే. పరిష్కారం చాలా సింపుల్‌గానే ఉన్నది కదూ!

  • Loading...

More Telugu News