Maryam Nawaz Sharif: కోర్టుకు స్టేట్‌మెంట్ ఇస్తూ కామాలు, ఫుల్‌స్టాప్‌లు చదివిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె

  • లండన్ ఆస్తుల కేసులో కోర్టులో వాంగ్మూలం
  • విరామ చిహ్నాలను ఒత్తి పలికిన మరియం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె  మరియం నవాజ్ కోర్టును ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించారు. లండన్‌లోని షరీఫ్ కుటుంబ ఆస్తులపై కోర్టులో స్టేట్‌మెంట్ ఇస్తూ కామాలు, ఫుల్‌స్టాప్‌లు చదివి న్యాయమూర్తులను ఇబ్బంది పెట్టారు. ఆమె తీరుతో ఇబ్బంది పడిన జడ్జి ఆమెను హెచ్చరించారు. అయితే, విరామ చిహ్నాలను తాను నొక్కి వక్కాణించడానికి కారణం ఉందని, వాటిని సరిగ్గా పలకకపోతే అర్థాలు మారిపోయే అవకాశం ఉందని మరియం పేర్కొన్నారు.

నవాజ్ షరీఫ్ లండన్‌లో అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై ఇటీవల తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఆయన కుమార్తె కోర్టులో వాంగ్మూలం ఇస్తూ కోర్టు సమయాన్ని వృథా చేసేందుకు ప్రయత్నించారు. విరామ చిహ్నాలను ఒత్తి పలుకుతూ న్యాయమూర్తులను ఇబ్బంది పెట్టడంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Maryam Nawaz Sharif
Pakistan
nawaz sharif
  • Loading...

More Telugu News