modi: మా ప్రయాణం ప్రారంభమై నాలుగేళ్లయింది.. ప్రతిభారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా!: ప్రధాని మోదీ

  • 2014 ఇదే రోజున, మా ప్రయాణం ప్రారంభమైంది
  • మా ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఉంచారు
  • గత నాలుగేళ్లుగా అభివృద్ధి అనే అంశం సామూహిక ఉద్యమమైంది
  • 125 కోట్ల మంది భారతీయులు భారత్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్నారు

2014లో సరిగ్గా ఇదే రోజున భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలనుద్దేశించి మోదీ వరుస ట్వీట్లు చేశారు. ‘2014.. ఇదే రోజున, భారత్ లో మార్పు తీసుకురావడం కోసం మా ప్రయాణం ప్రారంభమైంది. గత నాలుగేళ్లుగా, అభివృద్ధి అనే అంశం సామూహిక ఉద్యమమై ప్రతిధ్వనిస్తోంది.

దేశాభివృద్ధి కోసం ప్రతి భారతీయుడు ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాడు. 125 కోట్ల మంది భారతీయులు భారత్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్నారు. మా ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఉంచిన ప్రతి భారతీయుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ మద్దతు, వారు చూపించే ప్రేమే ప్రభుత్వానికి అతిపెద్ద వనరు. అంతేకాదు, ప్రభుత్వానికి ప్రేరణ, శక్తీ కూడా. అంతే ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు, అంకిత భావంతో భారత ప్రజలకు మా సేవలను కొనసాగిస్తాం. స్థిర చిత్తం, నైతిక సూత్రాలకు కట్టుబడి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలే నవభారత్ కు పునాదిరాళ్లు’ అని మోదీ పేర్కొన్నారు. 

modi
pm
2014 may 26
  • Error fetching data: Network response was not ok

More Telugu News