YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే

  • శంబంగిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జగన్
  • మూడుసార్లు శాసన సభ్యుడిగా పనిచేసిన శంబంగి
  • పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న జగన్ యాత్ర

బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ చీఫ్ జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన అప్పలనాయుడు, ఓ సారి స్వతంత్ర అభ్యర్థిగా, రెండుసార్లు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 1994లో టీడీపీ విప్‌గానూ పనిచేశారు. అప్పలనాయుడుతోపాటు మరికొందరు స్థానిక నేతలు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.  

ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో కొనసాగుతోంది. అక్కడే జగన్‌ను కలిసిన అప్పలనాయుడు పార్టీలో చేరారు. కాగా, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏపీ, తెలంగాణలో పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మున్ముందు ఆపరేషన్ ఆకర్ష్‌ను మరింత పెంచాలని వైసీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

YSRCP
Jagan
Bobbili
  • Loading...

More Telugu News