Ramgopal Varma: రాంగోపాల్ వర్మ ఫిర్యాదుతో జయకుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • వర్మపై అసభ్యకర కామెంట్లు చేసిన జయకుమార్
  • గతంలో వర్మ వద్ద స్క్రిప్ట్ రైటర్ గా పని చేసిన జయకుమార్
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు

నగ్నంగా ఉన్న అమ్మాయిల బొమ్మలకు తన తలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కించపరుస్తున్నారని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఫిర్యాదుపై విచారించిన హైదరాబాద్, పంజాగుట్ట పోలీసులు గతంలో ఆయన దగ్గర పనిచేసిన జయకుమార్ ను అరెస్ట్ చేశారు.

 చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన జయకుమార్ 2014 నుంచి 2017 మధ్య కాలంలో వర్మ వద్ద స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశాడు. ఆపై వర్మ తొలగించడంతో కక్ష కట్టాడు. ఆపై అసభ్యకరంగా కామెంట్లు పెడుతూ, మార్ఫింగ్ ఫొటోలను వైరల్ చేస్తుండగా, పంజాగుట్ట పోలీసులకు వర్మ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో న్యాయస్థానం అనుమతి తీసుకున్న పోలీసులు జయ కుమార్ పై పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి, విచారణ ప్రారంభించారు.

Ramgopal Varma
Facebook
Twitter
Jayakumar
Hyderabad
Police
  • Loading...

More Telugu News