Hariteja: థియేటర్లో నటి హరితేజకు ఎదురైన ఘటనపై ఘాటుగా స్పందించిన తమ్మారెడ్డి!

  • హరితేజ తండ్రి పక్కన కూర్చునేందుకు అంగీకరించని మహిళ
  • మగాళ్ల పక్కన కూర్చోడానికి తామేమీ సినిమావాళ్లం కాదని వ్యాఖ్య
  • కన్నీటితో తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పిన హరితేజ

ఓ సినిమా థియేటరులో తనకు ఎదురైన అనుభవాన్ని కన్నీరు పెట్టుకుంటూ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ చెప్పుకోగా, దాన్ని చూసిన తమ్మారెడ్డి భరధ్వాజ తీవ్ర స్థాయిలో స్పందించారు. హరితేజ వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం, ఇటీవల 'మహానటి' సినిమా చూసేందుకు తన తండ్రి, తల్లి, చెల్లెలుతో కలసి హరితేజ వెళ్లింది. విశ్రాంతి తరువాత, వారు సీట్లు మారారు.

దీంతో వీరి పక్కన కూర్చున్న తల్లీ కూతుళ్లు హరితేజ కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. తన కుమార్తె పక్కన హరితేజ తండ్రి కూర్చోరాదని వాదించిన ఓ ప్రేక్షకురాలు, మీ నాన్న పక్కన కూర్చోడానికి తన కుమార్తె ఇబ్బంది పడుతోందని, మగాళ్ల పక్కన కూర్చోడానికి తామేమీ సినిమా వాళ్లం కాదని గట్టిగానే చెప్పింది. ఈ మాటలతో హర్ట్ అయిన హరితేజ, తాను ఎదుర్కొన్న ఘటనపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

ఇక దీన్ని చూసిన నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ తీవ్రంగా స్పందించారు. సదరు ప్రేక్షకురాలేమైనా పతివ్రత అన్న సర్టిఫికెట్ తో థియేటర్ కు వచ్చిందా? అని ప్రశ్నించారు. తన మాటలు బాధపెడితే క్షమించాలని అంటూనే, సినిమావాళ్లను చిన్న చూపుచూడవద్దని, వారూ మామూలు మనుషులేనని, తాము ప్రేక్షకులను దేవుళ్లుగా చూస్తామని చెప్పుకొచ్చారు. ఆ వీడియోను మీరూ చూడండి.

Hariteja
Movie Theater
Tammareddy Bharadhwaj
  • Error fetching data: Network response was not ok

More Telugu News