: త్వరలో హైదరాబాద్ పబ్బుల్లో అమ్మాయిలతో సర్వింగ్
ప్రస్తుతం హైదరాబాద్ నగర పబ్బుల్లో అమ్మాయిలు కేవలం బార్ టెండర్లు, స్టీవార్డులుగానే విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే కస్టమర్లకు మద్యం సర్వ్ చేసే బాధ్యతలు కూడా అమ్మాయిలకే అప్పగించాలని పలు పబ్బుల యాజమాన్యాలు నిర్ణయించాయి. ముంబయి, బెంగళూరుల్లో పబ్బుల్లో అమ్మాయిలతో మద్యం సరఫరా ప్రారంభించిన తర్వాత వారి వ్యాపారం పుంజుకోవడంతో నగర పబ్ యజమానుల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి.
ఈ విషయానికి రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. నిబంధనలకు లోబడి మరింత మంది అమ్మాయిలను విధుల్లో నియమించుకోవడానికి తాము అనుమతిస్తామని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఫారూఖీ తెలిపారు. ముంబయి ,బెంగళూరుల్లో అమ్మాయిలతో మద్యం సర్వ్ చేయిస్తున్న తరహాలో నగరంలోనూ అనుమతించే విషయం ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.