KTR: నాకు ఇష్టమైన హీరో బాలయ్యే.. తారకరామారావు పేరు చెడగొట్టను: కేటీఆర్

  • ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో నాన్న నాకు ఆయన పేరు పెట్టారు
  • తారకరామారావు పేరును నిలబెట్టే పనులే చేస్తా
  • బసవతారకం ఆసుపత్రి కోసం ఏదో చేయాలని అమ్మ చాలా సార్లు చెప్పారు

సినీ పరిశ్రమలో తనకు అందరికంటే ఎంతో ఇష్టమైన నటుడు బాలకృష్ణ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. దివంగత ఎన్టీఆర్ మీద అభిమానంతో తనకు తారకరామారావు అనే పేరును నాన్న కేసీఆర్ పెట్టారని... తారకరామారావు పేరును నిలబెట్టే పనులే చేస్తానని, చెడగొట్టే పనులు మాత్రం చేయనని చెప్పారు.

'బసవతారకం ఆసుపత్రి గురించి మా అమ్మ నాకు కనీసం వంద సార్లు చెప్పి ఉంటారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వసతికి, ఆసుపత్రి అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలని చెప్పేవారు' అని కేటీఆర్ తెలిపారు. తాను మంత్రి అయిన తర్వాత కూడా ఆసుపత్రి గురించి అమ్మ చాలా సార్లు గుర్తు చేశారని చెప్పారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఈరోజు అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను కేటీఆర్, బాలకృష్ణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ విధంగా స్పందించారు.

క్యాన్సర్ ను అవగాహనతోనే నిర్మూలించవచ్చని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు. సెలబ్రిటీలంతా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. తెలంగాణలో ఉన్న అన్ని ట్రస్టులకు ప్రాపర్టీ ట్యాక్సులను రద్దు చేస్తామని చెప్పారు. 

KTR
Balakrishna
ntr
KCR
basavatarakam hospital
  • Loading...

More Telugu News