petrol: పగ్గాల్లేని పెట్రోల్... ముంబైలో లీటర్ రూ.85.29... పరిష్కారం కనుగొనని కేంద్రం

  • హైదరాబాద్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర రూ.82.07
  • డీజిల్ ధర రూ.74.49
  • కేంద్రం పరిశీలనలో ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు

పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ పడడం లేదు. వరుసగా 11వ రోజు ధరల్ని ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.85.29కి చేరింది. డీజిల్ ధర ముంబైలో లీటర్ 72.96కు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 77.49గా ఉండగా, డీజిల్ ధర 68.53గా ఉంది. మరోవైపు ధరలు ఇంతగా పెరిగిపోతున్నా కేంద్ర సర్కారు మౌనం వహిస్తోంది. ధరల్ని అదుపుచేసే పరిష్కారంపై మాట్లాడడం లేదు. ధరల్ని నియంత్రించే ప్రణాళికపై కేంద్రం పనిచేస్తోందని, మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం వెలువడొచ్చని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే.

చివరికి ప్రభుత్వరంగ చమురు కంపెనీ హెచ్ పీసీఎల్ చైర్మన్, ఎండీ ముకేశ్ కమార్ సురానా సైతం పెట్రోల్, డీజిల్ పై పన్నుల విధానాన్ని సమీక్షించడం ద్వారా వినియోగదారులకు ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. తాము ఎక్కువగా అమ్మకాలపైనే ఆధారపడ్డామని, లాభాల మార్జిన్ చాలా తక్కువని, అంతర్జాతీయంగా ధరలు పెరుగుతుంటే తాము ఏం చేయలేమని స్పష్టం చేశారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు కేంద్రం పరిశీలనలో ఉంది. అలాగే, రాష్ట్రాల్లో స్థానిక పన్నులను తగ్గించినా ధరలు దిగొస్తాయి. మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో పెట్రోల్ లీటర్ రూ.82.07గా ఉండగా డీజిల్ ధర లీటర్ రూ.74.49గా ఉంది. 

  • Loading...

More Telugu News