nani: నాని హీరోగా మరో తమిళ మూవీ .. కథానాయికగా అమలా పాల్

  • తమిళంలో నాని రెండో మూవీ
  • అవినీతిపై పోరాడే పాత్ర  
  • కథానాయికగా అమలా పాల్

తెలుగులో వరుస సినిమాలు చేస్తూ .. విభిన్నమైన నటనను ప్రదర్శిస్తూ నాని దూసుకుపోతున్నాడు. గతంలో ఒక తమిళ సినిమా చేసిన ఆయన, ఇప్పుడు మరో తమిళ సినిమా చేస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో 'వేలన్ ఎట్టుత్తిక్కుమ్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నాని సరసన కథానాయికగా అమలా పాల్ నటిస్తోంది. అవినీతి .. అక్రమాలపై పోరాడే ఒక యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు. సామాజిక సందేశంతో కూడిన యాక్షన్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. సాద్యమైనంత త్వరలో తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో నానికి తమిళనాట కూడా క్రేజ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

nani
amala paul
  • Loading...

More Telugu News