Tirupati: చెట్టుకు ఉరేసుకుని టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య!

  • శ్రీ వెంకటేశ్వరా పూర్ హోమ్ లో పని చేస్తున్న శంకర్
  • భార్య ఆత్మహత్య కేసులో శంకర్ పై సాగుతున్న విచారణ
  • నిన్న మధ్యాహ్నం ఆత్మహత్య

తను పని చేస్తున్న కార్యాలయానికి సమీపంలోనే టీటీడీ ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం, తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వరా పూర్ హోమ్ లో ఆఫీస్ సబార్డినేట్ గా పీ శంకర్ (37) పనిచేస్తున్నాడు. ఆయన భార్య ప్రసన్నకుమారి రెండు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించింది.

ఈ కేసులో శంకర్ పై ఫిర్యాదులు రావడంతో కేసు నడుస్తోంది. భార్య మృతి తరువాత మనోవేదనతో ఉన్న శంకర్, రెండు వారాల క్రితం తనకు అండగా ఉన్న పూర్ హోమ్ సూపరింటెండెంట్ మృతితో మరింత కుంగిపోయాడు. నిన్న డ్యూటీకి వచ్చిన శంకర్, సాయంత్రం 3 గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న చెట్టుకు ఉరేసుకుని మరణించాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అతని జేబులో ఉన్న సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని శంకర్ రాసుకున్నాడు. కాగా, పూర్ హోమ్ లో ఉన్నతాధికారులు ఎవరైనా శంకర్ ను వేధించారా? అన్న కోణంలోనూ విచారణ సాగిస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Tirupati
TTD
SV Poor Home
Sucide
  • Loading...

More Telugu News