Rajinikanth: ఆ ఆందోళనకు రాజకీయాల్ని జతచేశారు: తూత్తుకుడి ఘటనపై రజనీకాంత్‌

  • ఇంటెలిజెన్స్‌‌ డిపార్ట్‌మెంట్‌ను సర్కారు దుర్వినియోగం చేసింది
  • భద్రతా బలగాలు దారుణంగా వ్యవహరించాయి
  • బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి 

తమిళనాడులోని తూత్తుకుడిలో ఆందోళనలు చెలరేగుతోన్న విషయంపై సినీనటుడు రజనీకాంత్‌ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టెరిలైట్‌ కాపర్‌ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి చెంది, పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.

ఈ విషయంపై రజనీకాంత్ మాట్లాడుతూ... ఆ ఆందోళనకు రాజకీయాల్ని జతచేసి, ఇంటెలిజెన్స్‌‌ డిపార్ట్‌మెంట్‌ను సర్కారు దుర్వినియోగం చేసిందని అన్నారు. భద్రతా బలగాలు దారుణంగా వ్యవహరించడాన్ని తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని రజనీకాంత్ చెప్పారు. కాగా, తూత్తుకుడిలో ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

  • Loading...

More Telugu News