Pawan Kalyan: 'అల్లుడు ట్యాక్స్' కట్టాలన్న పవన్ కల్యాణ్ కు టీడీపీ ఎమ్మెల్యే లీగల్ నోటీసులు!

  • పలాసలో మాత్రం అదనంగా అల్లుడు ట్యాక్స్ కట్టాలన్న పవన్
  • మండిపడుతున్న పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ
  • ఈ ఆరోపణలను నిరూపించాలని డిమాండ్

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శివాజీ మండిపడుతున్నారు. పవన్ తనపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పలాసలో తాను అవినీతికి పాల్పడినట్టు చేసిన ఆరోపణలను పవన్ కల్యాణ్ నిరూపించాలని సవాల్ విసిరారు.

‘జీఎస్టీ విన్నాం. కానీ, పలాసలో మాత్రం అదనంగా అల్లుడు ట్యాక్స్ కట్టాలి’ అంటూ కాశీబుగ్గలో నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. వ్యక్తిగతంగా తన కుటుంబంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేశారని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు లీగల్ నోటీసులు పంపినట్టు శివాజీ చెప్పారు.

Pawan Kalyan
Telugudesam
palasa mla gowth shivaji
  • Loading...

More Telugu News