idea cellular: రోజూ 2జీబీ డేటాతో ఐడియా రూ.499 ప్లాన్

  • 81 రోజుల్లో 164జీబీ డేటా
  • ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ ఆఫర్లు
  • ప్రత్యర్థి కంపెనీలకు పోటీగా ప్లాన్ ఆవిష్కరణ

ఐడియా సెల్యులర్ రూ.499తో ప్రీపెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. ఈ ప్లాన్ లో భాగంగా ప్రతి రోజు 2జీబీ డేటా చొప్పున 81 రోజుల వ్యాలిడిటీలో 164జీబీ 4జీ/3జీ/2జీ డేటాను పొందొచ్చు. దీనికి అదనంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు చొప్పున ఉచితంగా లభిస్తాయి.

ప్రత్యర్థి కంపెనీలు జియో, ఎయిర్ టెల్ కు పోటీగా ఐడియా ఈ ప్లాన్ ను ఆవిష్కరించింది. ఎందుకంటే జియో సైతం రూ.498 ప్లాన్ ను 91 రోజుల వ్యాలిడిటీతో 182 జీబీ డేటా ప్రయోజనంతో అందిస్తోంది. అటు ఎయిర్ టెల్ సైతం రూ.499 ప్లాన్ ను 82 రోజుల వ్యాలిడిటీతో 164జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ రెండు కంపెనీల ప్లాన్లలోనూ ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయాలు ఉన్నాయి.

idea cellular
prepaid data plan
  • Loading...

More Telugu News