Bandaru Vaishnav: 21 ఏళ్లకే నూరేళ్లూ నిండిపోయాయా?... దత్తాత్రేయను ఓదార్చలేకపోతున్న బంధువులు!

  • దత్తన్నకు 49 ఏట పుట్టిన వైష్ణవ్
  • అల్లారు ముద్దుగా పెంచుకున్న దత్తన్న
  • ఎవరితోనూ మాట్లాడలేక పోతున్న దత్తాత్రేయ

లేకలేకపుట్టిన బిడ్డ 21 ఏళ్లకే దూరమైన వేళ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. గత రాత్రి దత్తన్న కుమారుడు వైష్ణవ్, హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. లేక లేక కలిగిన కుమారుడి మరణవార్తను ఈ ఉదయం తెలుసుకున్న దత్తన్న హతాశులయ్యారు. ఆయన్ను పరామర్శించేందుకు పలువురు నేతలు వచ్చినా, ఎవరితోనూ మాట్లాడే పరిస్థితుల్లో ఆయన లేరని తెలుస్తోంది.

దత్తన్న ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని ఆయన ఇంటివద్ద ఏర్పాటు చేశారు. దత్తాత్రేయకు 49 సంవత్సరాల వయసులో వైష్ణవ్ జన్మించాడు. ఆ తరువాత దత్తన్న దంపతులకు కుమార్తె విజయలక్ష్మి జన్మించింది. అన్నయ్య మరణంతో విజయలక్ష్మి కన్నీరు మున్నీరవుతోంది. దత్తాత్రేయను హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నటుడు నందమూరి హరికృష్ణ తదితరులు పరామర్శించారు.

Bandaru Vaishnav
Dattatreya
Died
Heart Attack
  • Loading...

More Telugu News