egg: ప్రతిరోజు కోడి గుడ్డు తింటే గుండెపోటుకు దూరమే!
- పెకింగ్ హెల్త్ సైన్స్ సెంటర్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల అధ్యయనం
- నాలుగు లక్షల మంది ఆహారపు అలవాట్లపై పరిశోధన
- కోడి గుడ్డు తింటే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని వెల్లడి
ప్రతిరోజు కోడి గుడ్డు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మరోసారి తేలింది. పెకింగ్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో పలు విషయాలు వెల్లడయ్యాయి. 30 నుంచి 79 సంవత్సరాల మధ్య ఆరోగ్యవంతులైన నాలుగు లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశోధకులు పరిశీలించగా.. వారానికి అయిదు సార్లు గుడ్డు తింటే గుండె జబ్బుల ముప్పు 12 శాతం తగ్గుతుందని తేలింది.
రోజూ కోడి గుడ్డు తినేవారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే గుడ్డు తినని వారి కంటే తినేవారిలో గుండెపోటు ముప్పు కూడా 26 శాతం తక్కువగా ఉన్నట్లు, గుండె జబ్బుల ద్వారా మరణించే అవకాశం 18 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. అందుకే ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతిరోజు ఓ కోడి గుడ్డు తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.