Pawan Kalyan: అసలు దిశ, దశ పవన్‌ కల్యాణ్‌ పార్టీకి ఉన్నాయా?: మంత్రి కళా వెంకట్రావు

  • టీడీపీకి సాయం చేశానని పవన్ అంటున్నారు
  • మీరేం మాట్లాడుతున్నారో తెలుసుకోండి
  • చంద్రబాబు అభివృద్ధికి నిదర్శనం
  • చంద్రబాబు మాత్రమే న్యాయం చేయగలరని గెలిపించారు

ప్రజలు ఎల్లప్పుడూ టీడీపీ వైపే ఉంటారని ఏపీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ధర్మ పోరాట బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ... "ఈ రోజు పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు.. తాను తెలుగుదేశం పార్టీకి సాయం చేశానని పదే పదే అంటున్నారు. అసలు దిశ, దశ ఆయన పార్టీకి ఉన్నాయా? ఎన్నికల్లోకి
మీరు ఎప్పుడొచ్చారు? బీజేపీ ఎప్పుడొచ్చింది? మండల, మున్సిపల్‌ ఎన్నికలు బీజేపీ, పవన్‌ కల్యాణ్‌లతో కలవకముందే జరిగాయి.

ఆయా ఎన్నికల్లో వచ్చిన సీట్లు చూస్తే మీతో పొత్తు పెట్టుకున్నాక వచ్చిన సీట్లే తక్కువ. మీరేం మాట్లాడుతున్నారో తెలుసుకోండి. చంద్రబాబు అభివృద్ధికి నిదర్శనం, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మాత్రమే న్యాయం చేయగలరని ప్రజలు ఆయనను గెలిపించారు" అని అన్నారు. మరోవైపు వైసీపీ నేత విజయ సాయిరెడ్డి ప్రధానమంత్రితో కలిసి కూర్చొని టీ తాగుతున్నారని, కర్ణాటక ఎన్నికల్లోనూ బీజేపీకి అనుకూలంగా వైసీపీ వ్యవహరించడాన్ని చూశామని అన్నారు.

Pawan Kalyan
Jana Sena
kala venkat rao
  • Loading...

More Telugu News