bc patil: యడ్యూరప్ప, శ్రీరాములు, మురళీధర్ రావుల పేర్లను బయటపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్

  • బలపరీక్షలో గెలిచేందుకు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు
  • మంత్రి పదవులు, కోట్ల రూపాయలు ఆఫర్
  • తనను సంప్రదించినవారి పేర్లను బయటపెట్టిన బీసీ పాటిల్

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో బలపరీక్షలో నెగ్గేందుకు జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ప్రలోభాలకు గురి చేశారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మంత్రి పదవులతో పాటు రూ. 100 కోట్లు ఆఫర్ చేశారని సాక్షాత్తు కుమారస్వామి ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవనగౌడ చన్నబసవనగౌడ పాటిల్ (బీసీ పాటిల్) బాంబు పేల్చురు.

బలపరీక్షలో బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తే... మంత్రి పదవితో పాటు, మరెన్నో ఇస్తామని బీజేపీ తనను ప్రలోభ పెట్టిందని ఆయన తెలిపారు. తనను సంప్రదించిన వారిలో యడ్యూరప్ప, శ్రీరాములు, మురళీధర్ రావు లు కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీని మరింత ఇరకాటంలోకి నెట్టేశాయి. 

bc patil
karnataka
yeddyurappa
sriramulu
  • Loading...

More Telugu News