Ravela Kishore Babu: మాజీ మంత్రి రావెలను కించపరిచిన ఎన్నారైపై కేసు నమోదు

  • సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సుధాకర్ చౌదరి
  • ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలన్న ఎమ్మార్పీఎస్
  • సైబర్ క్రైమ్ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రవాసాంధ్రుడిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, రావెలను కించపరుస్తూ ఎన్నారై అయిన సుధాకర్ చౌదరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మార్పీఎస్ నేతలు పాటిబండ్ల సుధాకర్, కాకుమాను యలమందరావులు సుధాకర్ చౌదరిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సుధాకర్ చౌదరిపై సైబర్ క్రైమ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సుధాకర్ చౌదరి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడు వాసిగా తెలుస్తోంది.

Ravela Kishore Babu
nri
Social Media
comments
police
case
mrps
sudhakar chowdary
  • Loading...

More Telugu News